అల్లు అర్జున్ ఖాళీగా ఉండి చేస్తున్న పని ఇదా?

చివరిగా ‘నా పేరు సూర్య’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండే అవకాసం ఉంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ రీమేక్ అనుకున్నారు కానీ తర్వాత వద్దనుకుని స్టైయిట్ సినిమాతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నారు. దాంతో ఆ ఖాళీ సమయాన్ని బిజినెస్ పై పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు స్టార్ హీరోల దృష్టి ఇప్పుడు పూర్తిగా బిజినెస్ వైపు మళ్ళింది. సినిమాలతో వచ్చిన ఫాలోయింగ్ తో బిజినిస్ లో పార్టనర్స్ ని వెతుక్కుని..తమ క్రేజ్ నే పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళ్లే ఆలోచనతో ఉంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు మల్టిఫ్లెక్స్ బిజినెస్ లోకి వచ్చారు. ఏఎంబీ సినిమాస్ పేరుతో ఏడు స్క్రీన్లతో మల్టీఫ్లెక్స్ థియేటర్ ఆయన ప్రారంభించారు. దీంతో తాను కూడా ఈ రంగంలోకి ప్రవేశించాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నారు.

ఐమాక్స్ మాల్ లాంటిది ఒకటి పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నారంగ్ ఫ్యామిలీస్ మాట్లాడుతున్నారని, అమీర్ పేట్ సర్కిల్స్ లో ఉన్న సత్యం ధియోటర్స్ ని మల్టిఫ్లెక్స్ లుగా మారిస్తే ఎలా ఉంటుందనే ప్లానింగ్ కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు వినపడుతోంది. ఆసియన్ సినిమాస్ అధిపతి సునీర్ నారంగ్‌ సైతం ఈ ప్రపోజల్ కు ఇంట్రస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.