ఐశ్వర్యారాయ్ ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు

                                                                   (సూర్యం)

కాలంతో సంభంధం లేకుండా కొందరు అలా ఉండిపోతారు. ఆ అందం చెక్కు చెదరదు. అలాంటి వాళ్లలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా ఒకరు.  ఐశ్వర్యారా  కనిపిస్తే కళ్లు తిప్పుకోవడం చాలా కష్టం. ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ స్టైలే వేరనేది అభిమానుల మాటే కాదు అందరి మాటా.  సినిమాల్లో కనిపించే ఆమెకు బయిట  ఈవెంట్స్‌లో   కనిపించే తీరు విభిన్నంగా ఉంటుంది.ఈవెంట్స్ లో ఈ నడివయస్సు నాంచారి   మనల్ని ఇంప్రెస్
చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫొటోలలో ఐష్ కనిపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.ఈ పిక్స్ నెట్‌లో దుమారం రేపుతోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 45ఏళ్లు అయినప్పటికీ అంత ఏజ్ కనిపించకపోగా ఇప్పుడున్న వారందరికీ ఫుల్ కాంపిటేషన్ ఇస్తోంది. ఆమెహెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే..ఈ బాలీవుడ్ బ్యూటి …మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి బ్యాడ్ టైమ్ బాధపెడ్తోంది. ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి
చేజారిపోతున్నాయ్.   ఆమె నటించిన జజ్బా – ఫనేఖాన్ చిత్రాలు జస్ట్ యావరేజ్ గా నిలిచాయి. దాంతో ఐష్ క్రేజు ఆటోమెటిగ్గా తగ్గిందనేది ట్రేడ్ లో టాక్. దాంతో ఆమెను తీసుకునే విషయంలో  ఆచితూచి దర్శకనిర్మాతలు అడుగులేస్తున్నారు.   ఐష్ ప్లేస్ ని తాప్సీ రీప్లేస్ చేస్తూండటంతో ఈ బ్యూటి ఇమేజ్ బీటౌన్ లో ఏ రెంజ్ లో ఉందో అర్థం అవుతుంది.