అంజలి రెమ్యునరేషన్ ఇంతగా తగ్గిందా?

Anjali

నేటి తరం హీరోయిన్లలో అన్ లక్కీ అంటే అంజలీ అనే చెప్పొచ్చంటారు సినీ జనాలు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మల్టీ స్టారర్ లో నటించిన , ఎందుకో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు  రాలేదు. గీతాంజలి వంటి చిన్న చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన అదే స్థితి. దీంతో కోలీవుడ్ ను అంజలి ఆశ్రయించగా , అక్కడా దురదృష్టమే వరించింది.

దీంతో ఎం చేయాలో పాలుపోని ఆమె, తన రెమ్యునేషన్ ను భారీగా తగ్గించుకుందట. ఇటీవల తెలుగులో ఓ సినిమాను కేవలం రూ.60 లక్షలకు చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లే ఒక్కో సినిమాకు రూ .50 లక్షలకు పైగా తీసుకుంటున్న ఈ రోజుల్లో ప్రముఖ హీరోయిన్ అయిన అంజలి పరిస్థితి ఇలా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.