యాంకర్‌ రవిపై  పోలీస్ కేసు, కారణం ఏంటంటే

ప్రముఖ టీవి  యాంకర్‌ రవిపై హైదరాబాద్ లోని  ఎస్‌ఆర్‌ నగర్‌ పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ఫోన్‌లో బెదిరించటంతో పాటు రౌడీలతో
తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ సందీప్‌ అనే వ్యక్తి కేసు పెట్టాడు.

సందీప్ చెప్పిన వివరాలు ప్రకారం.. రవి నుంచి 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సందీప్‌. ఆ డబ్బును తిరిగి వసూళు చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారంటూ చెప్తున్నారు. ఈ విషయంపై రవిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు కేసు విషయంలో అవసరమైనప్పుడు  ఎంక్వైరీకి  హజరు కావాలన్నారు. 

ఇక గతంలోనూ  రవి   పై కేసు నమోదై కోర్టులు చుట్టూ తిరిగారు. నాగచైతన్య‘రారండోయ్‌ వేడుక చూద్దాం’  సినిమా  కార్యక్రమంలో మహిళలను
కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై కేసు నమోదు అయ్యింది.    ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారు.   చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.