కొత్తగా ఆలోచించమంటోంది సమంత

సమంతను పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ పాత్రల్లో చూడటానికి ఆమె అభిమానులు రెడీగానే ఉన్నారు. అయితే, నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రల్లో నటించాలని సమంత నిర్ణయానికి వచ్చింది. ఆ విధంగా ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాల్లో నటించింది. వాటిని ప్రేక్షకులు ఆదరించడంతో సమంతలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. దీంతో, ఇకపై తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలని గట్టిగా నిర్ణయించుకుందట. తమిళ సూపర్‌ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌లో త్రిష పోషించిన ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత మరే కొత్త చిత్రాన్ని కమిట్‌ కాలేదు. వస్తున్నవి అన్నీ సాదా సీదా పాత్రలే కావడంతో నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో, కొత్తగా ఆలోచించాలని దర్శక, రచయితలకు సూచనలు ఇస్తోందట.