ఏవైన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ కి వస్తే హీరోలకే కాదు నిర్మాతలకు కూడా అది ఒక పెద్ద తల నొప్పిగా మారుతుంది. అందులోనూ ఇద్దరూ క్రూజీ స్టార్స్ అయితే ఆ జోష్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతి పోటీలో మహేష్, అల్లుఅర్జున్ ఇద్దరూ పోటీపడుతున్నారు. సరిలేరు 11న విడుదలవుతుంటే, అల 12న వస్తాయని గతంలో చిత్ర యూనిట్‌లు విడుదల తేదీని నిర్ణయించాయి. కానీ ఇప్పుడు ఆ డేట్ లు మారాయి. సడెన్‌గా అల చిత్రం 10వ తేదీనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది. దానికి కారణం లేకపోలేదు. మహేష్ నటించిన సరిలేరు చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కోసం ప్రయత్నించడమే అసలు కారణమని సమాచారం.
మహేష్ సరిలేరు ముందుగా విడుదలవ్వడం వల్ల థియేటర్లన్నీ లాక్ అయిపోతాయి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా విడుదలయ్యే సరిలేరు టీమ్ 12న విడుదలయ్యే అలకి ఎక్కువ థియేటర్లు ఇస్తామని ఒప్పుకున్నారట. అయితే తర్వాత మాత్రం తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు తమకే కావాలని ఎగ్జిబిటర్ల పై ఒత్తిడి పెంచారట. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతితో తమ సినిమాకు రెండో రోజు కూడా ఎక్కువ థియేటర్లు ఉండాలని డైరెక్ట్ గా థియేటర్ల ఓనర్లతో మాట్లాడుతున్నారట.
ముందు రెండు సినిమాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 11 న మహేష్ సినిమా ఎన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారో.. తర్వాత రోజుల్లో ఆన్నిథియేటర్లలో బన్నీ సినిమాను ప్రదర్శించే అవకాశం ఇవ్వాలట. ఉదాహరణకు ఒక మల్టిప్లెక్స్ లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి. 11 న మూడు స్క్రీన్స్ లో మహేష్ సినిమాను ప్రదర్శిస్తారు. 12 న మెయిన్ స్క్రీన్ లో మహేష్ సినిమానే ఉంటుంది.. మరో రెండు బన్నీ సినిమాకు ఇస్తారు. ఇందులో ఒకటి మెయిన్ థియేటర్ రెండోది సబ్ థియేటర్. అయితే 12 న రోజు బన్నీ సినిమాకు ఒక థియేటర్ తగ్గింది కాబట్టి 13 వ తేదీన ఒక స్క్రీన్ ఎక్కువ ఇచ్చి కవర్ చేస్తారు. ఇక 14 వ తారీఖు నుంచి రెండు సినిమాలకు సమానంగా స్క్రీన్ కౌంట్ ఉంటుంది. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బందంతా ఒకటే… మహేష్ టీమ్ తమ సినిమాకు ఇచ్చిన తేదీ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో 12 కూడా అన్ని స్క్రీన్స్ ఉండాలని పట్టుబడుతున్నారట. 13 నుంచి బన్నీ సినిమాకు అవకాశం ఇస్తాము అంటున్నారట. ఈ విషయంతో బన్నీ అండ్ టీమ్ అప్సెట్ అయ్యారని.. ఇలా జరిగితే తమ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ లో నష్టం జరుగుతుందని భావించి జనవరి 10 న రిలీజ్ చేస్తామంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కు ఊహించని విధంగా పెద్ద ఝలక్ ఇచ్చారని సమాచారం. మరి ఇలా థియేటర్ల విషయంలోనే తేడా వస్తే రేపు ఫ్యాన్స్ ఏ విధంగా ఫైట్ చేసుకుంటారో. ఇక ఈ రెండు సినిమాలు ఏ ఒక్క సినిమా అటూ ఇటూ అయినా సోషల్ మీడియా అంతా ఫ్యాన్స్ హంగామాతో ఘోరెత్తాల్సిందే. ఇకపోతే మొదటి నుంచి కూడా మహేష్ సినిమాని ఫాలోఅవుతూ దానిలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా పోటీపడుతున్నారు అలవైకుంఠపురంలో టీమ్. చివరికి ఏం జరుగుద్దో వేచి చూడాలి.