ఆయన గురించి నేను ఎప్పుడూ చెప్పలేని విషయాలు.. చిరంజీవితో తన రిలేషన్ గురించి బయటపెట్టిన బన్నీ!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహలో అన్స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 4 కి బన్నీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందులో అల్లు అర్జున్ తన తప్లి సురేఖతోపాటు మొదటి భాగంలో కనిపించగా, పిల్లలతో రెండో భాగంలో కనిపించారు. ఈ షోలో బాలయ్యతో ఎన్నో కబుర్లు చెప్పిన బన్నీ చిరంజీవితో తన రిలేషన్ గురించి మాట్లాడారు. బన్నీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గరనుంచి తను మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యానో అని ప్రతి ఆడియో ఫంక్షన్ లోనూ చెప్తూనే వచ్చారు.

తన వంతు సపోర్ట్ నీ మెగాస్టార్ కి ఎప్పుడూ ఇచ్చి ఒక మెగా ఫ్యాన్ గా నిలిచారు అల్లు అర్జున్. అయితే ఈ మధ్య ఏ ఈవెంట్లలో కూడా మెగా ఫాన్స్ గురించి మెగాస్టార్ గురించి మాట్లాడకుండా అల్లు ఆర్మీ అంటూ తననీ మెగా ఫ్యామిలీతో వేరు చేస్తున్నట్టే మాట్లాడారు. దీనివల్లే సోషల్ మీడియాలో ఎన్నో ఫాన్ వార్స్ కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోలు కూడా తాజాగా విడుదలకు దగ్గరగా ఉన్న పుష్ప 2 సినిమా గురించి ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ కి మధ్య ఏదో జరుగుతుంది అన్న ఆలోచనలను ప్రేక్షకుల్లో తెప్పిస్తున్నాయి.

కానీ బన్నీ మాత్రం షోలో బాలయ్య తో మాట్లాడుతూ గత 20 ఏళ్లలో నేను చిరంజీవి గారికి ఎంత ఫానో ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాను కానీ ఆ ముందు 20 ఏళ్ళు చిరంజీవి గారితో నా అనుభవం ఎవరికీ చెప్పలేదు. ఆయన స్టార్డం గురించి, ఆయన స్టార్ అన్న విషయం గురించి తెలియక ముందు నుంచే ఆయన మంచితనం గురించి నాకు తెలుసు. ఆ మంచితనాన్ని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. అయినా అంత పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ మాతో ఎంతో మంచిగా ప్రవర్తించేవారు.

మేము ఫస్ట్ టైం ఫారన్ వెకేషన్ కి వెళ్ళింది కూడా ఆయన వెంటే. ఆయన వెళ్లాలనుకుంటే తన ఫ్యామిలీతో వెళ్లొచ్చు కానీ మా పిల్లలందరినీ ఆయనతో తీసుకెళ్లి సరదాగా గడిపారు. ఆయనకి ఎప్పటికీ నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ నే అని చిరంజీవిని పొగుడుతూ చెప్పారు అల్లు అర్జున్. ఈ సమాధానంతో చాలామంది డౌట్లకు పుల్ స్టాప్ పడినట్టే. ఈ షో విడుదల తర్వాత అయినా మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫాన్స్ కి మధ్య తగాదాలు తగ్గుతాయేమో!