Mahesh–Rajamouli: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, అలాగే స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందు నుంచి ఈ సినిమా గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో ఈ సినిమాను మొదలు పెట్టి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు మూవీ మేకర్స్. హైదరాబాదులో మొదటి షెడ్యూల్ పూర్తికాగా రెండవ షెడ్యూల్ ని ఒడిశా అడవుల్లో చిత్రీకరించారు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ తెరకెక్కించారు రాజమౌళి.
అయితే ఒడిశా షెడ్యూల్ తర్వాత జక్కన్న మహేష్ బాబు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఎందుకంటే జపాన్ లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్, లండన్ లో ఆర్ఆర్ఆర్ క్లీనింగ్ కారణంగా రాజమౌళి కొత్త గ్యాప్ తీసుకోగా వేసవి సెలవులు కావడంతో సమ్మర్ వెకేషన్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం మహేష్ బాబు కూడా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మొత్తం అందరి పనులు పూర్తి అవ్వడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి. థర్డ్ షెడ్యూల్ మొదలు పెట్టడం కోసం రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఈనెల 9 నుంచి హైదరాబాదులో తాటి షెడ్యూల్ మొదలు కానుందట. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కీలకమైన వారణాసి ఎపిసోడ్‌ని ఈ థర్డ్ షెడ్యూల్ లోనే రాజమౌళి ప్లాన్ చేసినట్లు టాక్. ఇందుకోసం ఒక భారీ సెట్ ని రెడీ చేశారట. అందులోనే మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకలపై ఇంపార్టెంట్ సీన్స్ ని డైరెక్ట్ చేయబోతున్నారట జక్కన్న. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచరస్ మూవీగా SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందట.