Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా పక్క సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదు. అయితే రాజమౌళి చివరిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది.
ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆత్రుత నెలకొంది అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉండబోతుందని ప్రకటించారు గత సంవత్సరం పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అలాగే వర్క్ షాప్ లో పాల్గొనడం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇక జనవరి రెండో తేదీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది.
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి అయితే ఇప్పటివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోని కూడా విడుదల చేయలేదు. అలా విడుదల చేయకపోవడానికి గల కారణం ఏంటనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. గతంలో రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి కానీ మహేష్ సినిమాకు విడుదల చేయకపోవడంతో ఎంతోమంది ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.
రాజమౌళి ఏ పని చేసిన అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది అలాగే మహేష్ బాబు సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చెయ్యలేదు అంటే దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను బయటకు షేర్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు.