నన్ను కూడా ఒంటరిగా…: కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ ఆమని

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన హీరోయిన్ ఆమని పెళ్లయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలసిందే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ గురించి అంతగా ప్రచారం లేనప్పటికీ మాకు కూడా అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మొదట సినిమాలో అవకాశం ఉంది అంటూ తనని సంప్రదించేవారు, డిస్కషన్స్ అయ్యాక గెస్ట్ హౌస్ కి మీ అమ్మ లేకుండా ఒంటరిగా రమ్మని చెప్పేవారు. అలా చెప్పడంతో అసలు విషయం అర్ధమయ్యి అలాంటివారికి దూరంగా ఉండేదాన్ని అని చెప్పింది ఆమని. అయితే ఇవన్నీ పెద్ద నిర్మాణ సంస్థల్లో ఉండేవి కాదట. చిన్న కంపెనీలలోనే ఇలా జరిగేవని తెలియజేసింది.