తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్

సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ ట్రయిలర్ విడుదల అయింది. తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రం కాస్ట్ అండ్ క్రూ, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 13 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు.

హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని థ్రిల్ కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుందని, అందరూ కచ్చితంగా చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రం మీ అందరిని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, హైడ్ న్ సిక్ మూవీ కాస్ట్ అండ్ క్రూ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

థియేటర్ లో చూసే ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బస్సు రెడ్డి రానా తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిత్ర నటీనటులకు, టెక్నీషియన్స్ కు, నిర్మాతకు శుభాకాంక్షలు చెప్పారు.

హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము అని, ఇలాంటి ఎనర్జీనే ఈ చిత్రానికి అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ చూసినా చిత్రం పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ వైబ్ తోనే సెప్టెంబర్ 13న థియేటర్లో కలుద్దామని.. ఈ సందర్భంగా దర్శకుడు బాసిరెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, అలాగే కాలేజీ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రయిలర్ తో అందరిని ఆకట్టున్నాడు డైరెక్టర్ బాసిరెడ్డి రానా. ఓ కంప్లీకేటెడ్ మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా సాధిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతీ సీన్ అద్భుతంగా ఉంది. నటీనటులచే అద్భుతమైన యాక్టింగ్ రాబట్టుకున్నట్లున్నారు అనిపిస్తుంది. మంచి క్రైం సస్పెన్క్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హైడ్ న్ సిక్ చిత్రం ఈ సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబు అవుతోంది.

చిత్రం : హైడ్ న్ సిక్

నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు

దర్శకత్వం: బసిరెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ: ఎంఎన్ఓపీ
సంగీత దర్శకుడు: లిజో కె జోష్
సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
లిరిసిస్ట్ : సుద్దాల అశోక్ తేజ
ఆర్ట్ : నిఖిల్ హస్సన్
పీఆర్ఓ: హరీష్, దినేష్