హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి కాగా ఈరోజు వినాయక చవితి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. వినాయకుని నిమజ్జనం ప్రాంతాన్ని బట్టి మారుతుందనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున వినాయక చవితి ముగుస్తుంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకోవడం జరుగుతుంది.
గణేశ చతుర్థి నుంచి అనంత చతుర్దశి తిధి వరకు గణేశుడిని భక్తులు పూజిస్తారు. వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శుభ ఫలితాలు చేకూరుతాయి. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడంతో పాటు అనువైన సమయంలో వినాయకుడిని పూజించడం ద్వారా దేవుని అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు. 11 : 3 నుంచి మధ్యాహ్నం 1 : 34 వరకు వినాయకుని విగ్రహ ప్రతిష్టాపనకు సమయం అణువుగా ఉంటుందని చెప్పవచ్చు.
పూజా స్థలంలో అందమైన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి గణేషుడిని అలంకరించి పూర్తి ఆచారాలతో పూజలు చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. గణేశుడిని ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్టించడంతో పాటు ఆ దిశలో వినాయకుడిని పూజించడం శుభప్రదంగా ఉంటుంది. గణేశుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాగా గణపతి బప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్టించి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.
గణేశుని ఆరాధనలో దర్భ గడ్డి, పూలు, పండ్లు, దీపాలు, అగరుబత్తీలు, గంధం, కుంకుమ స్వామికి సమర్పించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. గణేషుడిని పూజించే సమయంలో ఓం గం గణపతయే నమః మంత్రాన్ని పఠిస్తే మంచిది. విరిగిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం, తులసి దళాన్ని , మొగలి పువ్వులను ఉపయోగించడం, తామసిక వస్తువులు తినడం, కుటుంబ సభ్యులతో గొడవ పడటం చేయకూడదు.