ఆ మహిళ వాడుకోవాలని చూసింది: రేసుగుర్రం విలన్

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. ఎంతోమంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చిత్ర పరిశ్రమలలో కూడా హీరోయిన్లపై కాస్టింగ్ కౌచ్ మాటున లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి.

ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్స్ నేరుగా బయటపెట్టారు. బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా తమ కెరీర్ ఆరంభంలో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు. కొంతమంది దర్శకులు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో కమిట్మెంట్లు అడిగారని పేర్కొన్నారు.

టాలీవుడ్ లో అయితే శ్రీ రెడ్డి ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యుతో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కేవలం మహిళ పైన మాత్రమే లైంగిక వేధింపులు జరిగాయా అంటే లేవని చెప్పాలి. మగవారి పైన కూడా లైంగిక వేధింపులు జరిగాయని కొంతమంది సెలబ్రిటీలు మీడియాతో పంచుకున్నారు.

ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కువగా మేల్ ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ గతంలో తమ జీవితంలో ఏదైనట్లుగా వాళ్ళ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తెలుగులో రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన భోజ్ పురి స్టార్ హీరో రవి కిషన్ అందరికి తెలిసే ఉంటుంది. డిఫరెంట్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు చేరువైన రవి కిషన్ ప్రస్తుతం బిజెపి ఎంపీగా కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను మీడియాతో పంచుకున్నారు.

కెరీర్ ఆరంభంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ మహిళ వాడుకోవాలని ప్రయత్నం చేసిందని తెలిపారు. సదరు మహిళ తనను కాఫీ తాగడానికి రాత్రికి ఇంటికి ఆహ్వానించింది. అయితే ఆమె ఉద్దేశ్యం తనకి అర్థం కావడంతో ఆ ఆఫర్ ని తాను తిరస్కరించానని రవి కిషన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో ఒక పెద్ద స్థాయిలో ఉందని కూడా చెప్పడం విశేషం. అయితే ఈ నటుడు కోరిక తీర్చమని ఆఫర్ చేసిన మహిళ ఎవరు అనేది ఇప్పుడు బి టౌన్ లో ఆసక్తికరమైన అంశంగా మారింది.