ఈ మధ్య కాలంలో మనుషులు సన్నగా ఉన్నా పొట్ట మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. శారరీక వ్యాయామం లేక, ఇంకొందరు పేలవమైన జీవనశైలి కారణంగా కూడా పొట్ట సమస్యతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. పొట్ట తగ్గడానికి కొంతమంది వేర్వేరు పానీయాలను తాగుతూ ఉంటారు.
పొట్ట తగ్గించడంలో అల్లం నీరు, మెంతినీరుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అల్లం జీవక్రియను పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినది కాగా ఈ నీళ్లు తాగడం ద్వారా ఎన్నో లాభాలు చేకూరుతాయి. ఇందులో ఉండే జింజోరోల్స్, పోగోల్స్ థర్మోజెనిసిస్ ను పెంచి శరీరంలో వేడిని పెంచి కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఉపయోగపడతాయి. సాంప్రదాయకంగా జీర్ణక్రియను పెంచడంలో అల్లం ఎంతగానో తోడ్పడుతుంది.
బరువు సమర్థవంతంగా తగ్గాలంటే ఆరోగ్యవంతమైన జీవక్రియ ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోషకాలు సరిగా గ్రహించడంలోనూ, శరీరంలో వ్యర్థాలు తొలగించడంలోనూ అల్లం తోడ్పడుతుంది. అల్లం ఆకలిని తగ్గించడంతో పాటు అతిగా తినడాన్ని నియంత్రించడంలో, కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
మెంతి గింజలలో పోషకాలు మెండుగా ఉండగా మెంతి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే బరువు తగ్గడం కూడా తేలిక అవుతుంది. మెంతులలో గెలాక్టోమన్నన్ అనే కరికే ఫైబర్ ఉండగా ఇది శరీరంలోని కొవ్వును శోషించడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.