టాలీవుడ్ స్టార్ హీరో ఆమెని వేధించాడంట

దేశముదురు మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ హాన్సిక మొత్వానీ. ఈ అమ్మడు మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రిలో నటించింది. మూడో చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా బిల్లా మూవీ చేసింది.

ఈ రెండు సినిమాలు ఆమె కి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. తెలుగులో హాన్సికకి సక్సెస్ రేషియో చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఈ బ్యూటీ బొద్దుగా తయారై కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సక్సెస్ లు అందుకొని స్టార్ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చింది. కోలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా ఎంత పాపులర్ అయ్యిందో శింభు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి అంతే పాపులర్ అయ్యింది.

ఒకానొక దశలో శింబుతో హాన్సిక పెళ్లి జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఎందుకనో వారి బంధానికి బ్రేక్ అప్ అయ్యింది. తరువాత మరల తెలుగులో కొంతకాలం సినిమాలు చేస్తూ వచ్చింది. బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ స్లిమ్ అయ్యి ఫిమేల్ సెంట్రిక్ కథలతో కూడా మూవీస్ చేసింది. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ బ్యూటీ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.

ఇక తాజాగా ఈ అమ్మడు తన మూవీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. అలాగే ఇండస్ట్రీ వేధింపుల గురించి కూడా చెప్పింది. అయితే టాలీవుడ్ లో చేస్తోన్న సమయంలో ఓ టాప్ హీరో తనతో డేటింగ్ చేయాలంటూ వేధించేవాడని హాన్సిక ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే అతనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని, హద్దులలో ఉండాలని చెప్పానని పేర్కొంది.

అయితే ఆ ఒక్క హీరో తప్ప టాలీవుడ్ లో మిగిలిన అందరూ తనతో చాలా మంచిగా ఉండేవారని హాన్సిక చెప్పడం విశేషం. అయితే ఆమెని డేటింగ్ చేయాలంటూ వేధించిన ఆ హీరో ఎవరనేది మాత్రం హాన్సిక క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హాన్సికతో సినిమాలు చేసిన హీరోలలో ఎవరు ఆమెని వేధించారు అనేది తెలుసుకోవడానికి ట్రై నెటిజన్లు ట్రై చేస్తున్నారు.