నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు…. క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నయనతార!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె దక్షిణాది ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సంపాదించారు.ఈమె కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా తన నటనతో మెప్పించారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే తప్పనిసరిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని విషయం మనకు తెలిసిందే.

ముఖ్యంగా హీరోయిన్లుగా వచ్చే వారికి అవకాశాలు రావాలంటే కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాలని ఇలా ఎంతోమంది ఈ ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారనే చెప్పాలి. ఇకపోతే లేడీ సూపర్ స్టార్ నయనతారకి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదని తెలుస్తోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయనతార క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులపై నోరు విప్పారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని అయితే ఏదైనా కూడా మన ప్రవర్తన బట్టి ఉంటుందని ఈమె తెలిపారు.

నన్ను కూడా కెరియర్ మొదట్లో కమిట్మెంట్లు అడిగారు. అందుకు నేను నో చెప్పాను.ఇలా ఏదైనా కూడా మనం ప్రవర్తించే తీరుబట్టి ఉంటుందని నేను కేవలం నా సొంత టాలెంట్ను నమ్ముకుని నా టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా నయనతార చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది నయనతార వంటి సీనియర్ టాలెంటెడ్ సెలబ్రెటీలకే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్ప లేదంటే సాధారణ నటీమణుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.