నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రూ.45 లక్షల వేతనంతో ఎస్బీఐలో జాబ్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనాలను చేకూరుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం గమనార్హం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా ఈ కాంట్రాక్ట్ వ్యవధిని పెంచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ స్పెషలిస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. https://bank.sbi/careers/current-openings లింక్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

సెప్టెంబర్ 24వ తేదీలోపు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్) ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్‌ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 58 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగ ఖాళీల ఆధారంగా వయోపరిమితిలో మార్పులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు ఉండగా ఇతరులకు ఫీజుకు సంబంధించి మినహాయింపులు ఉండనున్నాయి.

అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 29 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇతర ఆలవెన్స్ లు లభిస్తాయి.