శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి రెట్రో బీట్స్ ‘గువ్వ గూటిలో’ సాంగ్ రిలీజ్

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబో ‘శ్వాగ్’ హిలేరియస్ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేశారు. టీజర్‌లో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో, డిఫరెంట్ టైమ్‌లైన్‌లలో అద్భుతంగా ఆలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ సింగరో సింగ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్- గువ్వ గూటిలో విడుదల చేశారు. యయాతి డాన్స్ ట్రూప్ హెడ్ గా శ్రీవిష్ణు (Sree Vishnu) అదరగొట్టారు. ఈ పాట 80, 90ల స్టయిల్ విజువల్ ఎసెన్స్, రెట్రో బీట్‌లు, స్టైలిష్ కొరియోగ్రఫీతో వింటేజ్ నాస్టాల్జిక్ డైవ్ ప్రజెంట్ చేస్తోంది.

వివేక్ సాగర్ రెట్రో-కంపోజింగ్, భువన చంద్ర ఆకట్టుకునే లిరిక్స్ కంప్లీట్ చేశాయి. మనో, గీతా మాధురి, స్నిగ్ధా శర్మల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా పాడారు, ట్రాక్ కన్నుల విందుగా ఉంది. రెట్రో-స్టైల్ డ్యాన్స్ మూవ్‌లకు శిరీష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు.

కలర్ ఫుల్ జాతర నేపథ్యంలో సెట్ చేయబడిన గువ్వ గూటిలో సాంగ్ ప్రత్యేకించి గణేష్ చతుర్థి పండక్కి ట్రీట్ కాబోతోంది.

ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.

శ్వాగ్ (Swag) అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్
పీఆర్వో: వంశీ శేఖర్