Gallery

Home Tollywood జ‌బ‌ర్ద‌స్త్‌ క‌మెడియ‌న్ చెంప ఛెల్లుమంది!

జ‌బ‌ర్ద‌స్త్‌ క‌మెడియ‌న్ చెంప ఛెల్లుమంది!

జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ హ‌ద్దులు దాటుతోందంటూ సోష‌ల్ మీడియాతో పాటు యూట్యూబ్ లోనూ తెగ కామెంట్‌లు ప‌డేవి. ఇప్ప‌టికీ ప‌డుతూనే వున్నాయి. ఇప్పుడు `ప‌టాస్ 2` షో వంతు వ‌చ్చింది. ఇందులో వేసే పంచ్‌లు, ప్రాస‌లు కూడా డ‌బుల్ మీనింగ్‌లో వుంటున్నాయ‌ని గ‌త కొంత కాలంగా వినిపిస్తూనే వుంది. ఇంత‌కు ముందు ఈ షోని యంక‌ర్ ర‌వి, శ్రీ‌ముఖి న‌డిపించేవారు. అయితే శ్రీ‌ముఖి బిగ్‌బాస్ షోకి వెళ్లిపోవ‌డంతో ఆ స్థానాన్ని భ‌ర్తీచేయ‌డానికి వ‌ర్షిణి వ‌చ్చింది.

ఆ త‌రువాత ర‌వి కూడా త‌ప్పుకోవ‌డంతో చ‌లాకీ చంటి వ‌చ్చేశాడు. ఈ ఇద్ద‌రు క‌లిసి షోని బాగానే ర‌న్ చేస్తున్నారు. త‌న మార్కుని చూపించాల‌ని వ‌ర్షిణి కూడా హ‌ద్దులు దాటి పంచ్‌ల‌తో పాటు గ్లామ‌ర‌స్ డ్రెస్సింగ్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్ ముక్కు అవినాష్ చెంప ఛెల్లుమ‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స్కిట్‌లో భాగంగా అడ్వాంటేజ్ తీసుకున్న అవినాష్ ముందు ప్రేమ పాఠాల‌ని, ఆ త‌రువాత బెడ్రూమ్ పాఠాలుంటాయ‌ని అన‌డంతో వ‌ర్షిణి, క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ చెంప ఛెల్లుమ‌నిపించింద‌ట‌. దీంతో కంగుతిన్న అవినాష్ మ‌ళ్లీ ఏమంటే ఎలా రియాక్ట్ అవుతుందో అని సైలెంట్ అయిన‌ట్టు చెబుతున్నారు.

- Advertisement -

Related Posts

బిగ్ హౌస్‌లో ‘హగ్గు’ వెనుక ‘చీకటి’ కోణం.!

సీనియర్ నటి ప్రియ, కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసి వుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లను ఆమె చూసి వుండాలి. సమాజం పోకడల్ని అర్థం చేసుకోలేనంత అమాయకత్వం ఆమెకు వుంటుందని...

ఔను, రాజ్ కుంద్రా ‘బూతు’ మార్గంలోనే సంపాదించాడు.!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బండారం ఈసారి ఇంకాస్త గట్టిగా బట్టబయలయ్యింది. అశ్లీల చిత్రాల వ్యాపారం చేస్తున్నట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు రావడం, ఈ క్రమంలో ఆయన్ని...

తెలుగు సినిమా లెక్కలు తేలే సమయమొచ్చిందా.?

సినిమా డిజాస్టర్ అయినా, దాన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవడానికే సినీ జనాలు ఇష్టపడతారు. సినిమా అంటేనే అంత. అదొక గ్లామర్ ప్రపంచం. చాలా అరుదుగా మాత్రమే తమ సినిమాల్ని ఫ్లాప్ అని...

Latest News