జబర్దస్త్ కామెడీ హద్దులు దాటుతోందంటూ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లోనూ తెగ కామెంట్‌లు పడేవి. ఇప్పటికీ పడుతూనే వున్నాయి. ఇప్పుడు `పటాస్ 2` షో వంతు వచ్చింది. ఇందులో వేసే పంచ్‌లు, ప్రాసలు కూడా డబుల్ మీనింగ్‌లో వుంటున్నాయని గత కొంత కాలంగా వినిపిస్తూనే వుంది. ఇంతకు ముందు ఈ షోని యంకర్ రవి, శ్రీముఖి నడిపించేవారు. అయితే శ్రీముఖి బిగ్‌బాస్ షోకి వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని భర్తీచేయడానికి వర్షిణి వచ్చింది.
ఆ తరువాత రవి కూడా తప్పుకోవడంతో చలాకీ చంటి వచ్చేశాడు. ఈ ఇద్దరు కలిసి షోని బాగానే రన్ చేస్తున్నారు. తన మార్కుని చూపించాలని వర్షిణి కూడా హద్దులు దాటి పంచ్‌లతో పాటు గ్లామరస్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న జబర్దస్త్ కామెడియన్ ముక్కు అవినాష్ చెంప ఛెల్లుమనిపించడం ఆసక్తికరంగా మారింది. స్కిట్‌లో భాగంగా అడ్వాంటేజ్ తీసుకున్న అవినాష్ ముందు ప్రేమ పాఠాలని, ఆ తరువాత బెడ్రూమ్ పాఠాలుంటాయని అనడంతో వర్షిణి, కమెడియన్ ముక్కు అవినాష్ చెంప ఛెల్లుమనిపించిందట. దీంతో కంగుతిన్న అవినాష్ మళ్లీ ఏమంటే ఎలా రియాక్ట్ అవుతుందో అని సైలెంట్ అయినట్టు చెబుతున్నారు.