‘ఎన్టీఆర్’ లో రకుల్.. ఏ పాత్రలో అంటే

టాలీవుడ్ లో బ‌యోపిక్‌ల‌ హవా బాగా నడుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ రోల్ పోషిస్తున్నారు. మోహన్ బాబు, రానా, విద్య బాలన్, కీర్తి సురేష్ తదితర తారాగణం ఉన్నారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ కూడా ఈ సినిమాలో చోటు దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది.

సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ బాగా పాపులర్. ఈ మూవీలో స్పెషల్ అప్పీరెన్స్ కోసం రకుల్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఒక కీలక సన్నివేశంలో వచ్చే ఐటమ్ సాంగులో రకుల్ నర్తించనుంది అని టాక్. అయితే అది ఏ పాటకి అనే విషయం మాత్రం సస్పెన్స్ లో ఉంచారు చిత్ర బృందం.