ఆఫర్ల వెల్లువలో నివేత పెతురాజ్

ఎవరీ నివేత పెతురాజ్ అంటే, తెలుగులో శ్రీ విష్ణు ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇప్పటి దాకా ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. కాకపోతే ఇప్పటి దాకా ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించినా ఆమె ప్రతిభతో ఆమెకు సోలో హీరోయిన్ ఆఫర్లు అది కూడా పెద్ద హీరోల సినిమాల్లో వెతుక్కుంటూ వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, ఆమెను ఇప్పటికే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరోయిన్ గా తీసుకున్నా, ఆమెను అల్లు అర్జున్ తదుపరి సినిమా ‘ఐకాన్’ లో సోలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆమె ఈ సినిమాకు సంతకం చేసే అవకాశం ఎక్కువే ఉంది. అటు పైన దర్శకుడు కిశోరె తిరుమల తన తదుపరి చిత్రం రామ్ తో చేసే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
ఏది ఏమైనా ప్రతిభ, కష్ట పడి పని చేస్తూ అంచలంచెలుగా ఎదుగుతున్న నివేత కి ఆల్ ది బెస్ట్.