తెలంగాణ: వరంగల్ ప్రజలకు పురపాలక మంత్రి కేటీఆర్ తీపి కబురు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్న టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇక త్వరలోనే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులకు మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ గిప్ట్ ప్రకటించారు. కొత్త ఏడాదిలో హైదరాబాద్లో జలమండలి ద్వారా 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని పంపిణీ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజాగా వరంగల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులని మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈసందర్భంగా వరంగల్ వాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఉగాది నాటికి నగరంలో ప్రతి రోజు తాగునీరు అందుబాటులోకి రావాలని, అదే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, దానికి కావలసిన మౌలిక అవసరాలను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. వీటితో పాటుగా వరంగల్‌లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు అనే చర్చలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచి నగర పరిధిలో తాగునీరు ప్రతిరోజు అందించేలా ముందుకుపోవాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
— KTR, Former Minister (@MinisterKTR) December 21, 2020
నగర అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీయేటా రూ.300 కోట్ల బడ్జెట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత రోడ్లు,డ్రైనేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్లో అవసరమైన సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. గత ఆరేళ్లలో కేంద్రం ఇచ్చే నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఐదున్నర రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.