టిఆర్ఎస్ మంత్రి కారును అడ్డుకున్న టిఆర్ఎస్ (వీడియో)

మంత్రి చందులాల్ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టిఆర్ ఎస్ లోనే రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు ఒకరి పై ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.  సోమవారం జరిగిన పరిస్థితులతో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. చందులాల్ ను అడ్డుకొని అసమ్మతి వాదులు నిరసన తెలిపారు.

అసమ్మతి నేతలు గోవింద్ నాయక్, తాటి కృష్ణ, శోభన్, మేడారం రామ్మూర్తి తదితరులు మంగళవారం జరిపే ర్యాలీ  అనుమతి కోసం సోమవారం ఉదయం వెంకటాపురం పోలీస్ స్టేషన్ కు వాహనంలో వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎల్లారెడ్డి పల్లె సమీపంలో మంత్రి చందులాల్ వర్గీయులు వారి వాహనాన్ని అడ్డుకొని వాహనం టాప్ చించడంతో పాటు టైర్లలో గాలీ తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. అసమ్మతి నేతలు ఆందోళన చేసిన వీడియో కింద ఉంది చూడండి. 

 

మంగళవారం చందులాల్ మంగపేటలో ప్రచారం నిర్వహిస్తుండగా అస్మమతి నేతలు అక్కడకు చేరుకొని వారి వాహనాన్ని అడ్డుకున్నారు. టైర్లలో గాలి తీసి వాహనం ద్వంసం చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

టిఆర్ ఎస్ లోనే నేతలు అసమ్మతిగా ఉండటంతో నేతల మధ్య సయోధ్య నెలకొల్పడం కీలక నేతలకు తలనొప్పిగా మారింది. పార్టీలోనే గొడవలు పెట్టుకుంటే ప్రత్యర్దులకు బలం చేకూరే అవకాశం ఉందని నేతలు సూచించినా అసమ్మతి సెగలు చల్లారటం లేదని పలువురు వ్యాఖ్యానించారు. చందులాల్ చేసిందేం లేదని అతనిని మార్చి మరొకరికి టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు.