కొత్త విషయం… తెలంగాణలోనూ ప్యాకేజీ స్టార్ ని చేస్తారంట?

ఏపీలో పవన్ కల్యాణ్ మాటలు, చేష్టలు, విమర్శలు, రాజకీయ వ్యూహాలు బయటకు కనిపించే అంశాలను పరిగణలోకి తీసుకునే… పవన్ ని ప్యాకేజీ స్టార్ అని అంటారు వైసీపీ నేతలు. కొంతమంది దత్తపుత్రుడు అంటారు అది వేరే సంగతి. అయితే వైఇసీపీ నేతలు తీవ్రస్థాయిలో ప్యాకేజీ స్టార్ అని పవన్ ని విమర్శిస్తుంటారు. ఈ సమయంలో తెలంగాణలో కూడా అలాంటి పేరు వచ్చే కార్యక్రమం జరిగే ఛాన్స్ ఉందని అంటూ కథనాలొస్తున్నాయి.

అవును… ఏపీకంటే ముందుగానే తెలంగాణ‌లో ఎన్నిక‌లు వ‌స్తాయి. ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కనీసం మూడు నాలుగు మాసాల ముందు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే! ఈ ఎన్నిక‌ల్లోనూ త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్యర్థుల‌ను నిల‌బెడ‌తామ‌ని.. 119 అసెంబ్లీ సీట్లలో క‌నీసం 22 స్థానాల్లో అయినా గెలుస్తామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో వారాహి వాహ‌నానికి పూజ చేయించిన స‌మ‌యంలో కొండ‌గ‌ట్టు వ‌ద్ద చెప్పారు.

అనంతరం తెలంగాణ జనసైనికులతో మీటింగ్ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. పైగా ఏపీ అభివృద్ధి చెందలేదు కాబ్ట్టి తెలంగాణ యువత ఇబ్బందులు పడుతున్నారని కొత్త రకం భాష్యం తనదైన అజ్ఞానంతో చెప్పుకొచ్చారనే కామెంట్లూ వినిపించాయి. ఇదే సమయంలో 17 పార్లమెంటు స్థానాల్లోనూ బ‌ల‌మైన పోటీ ఇస్తామ‌ని.. ఒక‌టి రెండు స్థానాల్లో గెలిచేందుకు ప్రయ‌త్నం చేస్తామ‌ని.. ప‌వ‌న్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

అయితే తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ కేవలం కబుర్లు మాత్రమే చెబుతున్నారని.. కార్యచరణ శూన్యం అని చాలా మంది చెబుతుంటారు. అయితే దీని వెనక మహా వ్యూహం దాగితుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వ్యూహం కూడా కేసీఆర్ చేతుల్లో ఉందని అంటున్నారు. ఆ వ్యూహం ప్రకారం పవన్ ని రంగంలోకి దింపాలా వద్దా అనే విషయం చర్చకు వస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతానికైతే ఏపీపైనే ప‌వ‌న్ త‌న దృష్టిని నిమ‌గ్నం చేశారు. దీంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుందా.. లేదా.. అనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అంత‌ర్గతంగా విశ్లేష‌కులు చెబుతున్న మాట ప్రకారం.. తెలంగాణ అధికార పార్టీ బీఆరెస్స్ అధినేత కేసీఆర్ చెప్పిన‌ట్టుగా ప‌వ‌న్ వ్యవ‌హ‌రిస్తార‌ని.. కేసీఆర్ కు సెగ త‌గులుతుంద‌ని భావిస్తే.. వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ప‌వ‌న్‌ ను రంగంలోకి దింపుతార‌ని ఓ వ‌ర్గం నాయ‌కులు చెబుతున్నారు.

అలా కాకుండా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రయాణం సులువుగా సాగేలాంటి పరిస్థితులు కనిపిస్తే… పవన్ పోటీ తెలంగాణలో ఉండదని, కనీసం అటువైపు కూడా చూసే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా… తెలంగాణలో పవన్ రాజకీయం కేసీఆర్ అవసరాన్ని బట్టి ఆదారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఈ వ్యూహంలో భాగంగానే ప‌వ‌న్‌.. తెలంగాణ‌కు దూరంగా ఉంటున్నార‌ని.. అయితే, ఏపీలో చేస్తున్న ప్ర‌సంగాల్లో మాత్రం తెలంగాణ‌కు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నార‌ని చెబుతున్నారు. తద్వారా కేసీఆర్ పచ్చ జెండా ఊపితే ఈ తెలంగాణ కామెంట్ల డోసు పెరుగుతుంది, కేసీఆర్ ఎర్ర జెండా ఊపితే ఆ తెలంగాణ కామెంట్లకు కూడా జగన్ ని కారణం గా చూపిస్తూ సైడ్ చేయడం చేస్తారని అంటున్నారు!