ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు అని ఒక శతాబ్దం కిందట గురజాడ అప్పారావు గిరీశం అనే పెద్ద మనిషి చేత కన్యాశుల్కం ఒక పచ్చినంజ చెప్పించాడు. అప్పటికి పొలిటీషన్లంటే ఎవరున్నారు, దేశంలో ఉండేది ఒకే పార్టీ , అది కాంగ్రెస్. అందువల్ల అప్పటికే కాంగ్రెస్ నాయకులు ఒపినియన్ ఛేంజి చేస్తున్నారని, అది ప్రజలు గమనించారని అనుకోవాలి.
ఇపుడున్న రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ పిల్లలే. కలసి పనిచేయడం వల్లనో, ఏదో ఒక రోజు ఆ పార్టీలో ఉన్నందునో, లేక ఆపార్టీ ని రోజూ చూస్తున్నందునో కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్ని పార్టీలకు ఒంటబట్టింది. ఒపీనియన్ ఛేంజ్ చేయడం అనేది చాలా మామూలు వ్యవహారమయింది. ఈరోజు చెప్పింది రేపుండదు.రేపు మాట్టాడేది ఎల్లుండి మర్చిపోయి మాట మారుస్తారు. పిరాయింపుల మీద మాట మార్చని నాయకులు ఇండియాలోనే లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ కూడా దీనికి అతీతం కాదు.
ఆయన ఫిరాయింపులు మీద ఒక పుడు చాలా మండిపడ్డారు. ఎంతమండిపడ్డారంటే… ఇది ఈ వీడియో చూడండి తెలుస్తుంది. తెలంగాణలో ఇపుడు జరుగుతున్న ఫిరాయింపుల నేపథ్యంలో ఈ వీడియోను టి న్యూస్ నుంచి బయటకు లాగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది వైరలయ్యింది.