టిడిపిలో మిగిలేది ఎంతమంది ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందిరికీ అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడుకు వయసైపోతోంది. నారా లోకేష్ నాయకత్వంపై నమ్మకం కోల్పోవటంతో పాటు రాజకీయ భవిష్యత్తుపై టిడిపి నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున  గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. వారిలో పార్టీపై అభిమానం ఉన్నవారి కన్నా పదవులపై అభిమానం ఉన్నవారే ఎక్కువమంది. అందుకనే టిడిపిలో ఉండలేక వైసిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.

వైసిపి నేతల సమాచారం ప్రకారం 23 మంది ఎంఎల్ఏల్లో కనీసం 10 మంది వైసిపిలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. 10 మంది ఎంఎల్ఏలు టిడిపిని వదిలేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ప్రధాన ప్రతిపక్ష హోదా విషయం పక్కనపెట్టేస్తే అసలు టిడిపి మనుగడకే సమస్య అయ్యేట్లుంది.

అందుకనే ఎవరికి వారుగా టిడిపిని వదిలేసి తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే చాలామంది టిడిపి నేతలు వైసిపిలోనే తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారట. వైసిపిలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే బిజెపి వైపు చూసేవాళ్ళు కూడా ఉన్నారట. చూడబోతే టిడిపిలో ఎంతమంది ఎంఎల్ఏలుంటారనే విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.