తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ లో కారు జోరు కొనసాగుతున్నది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది కౌంటింగ్ ప్రక్రియ. పోస్టల్ ఓట్లతో మొదలుకొని రౌండ్ రౌండ్ కూ టిఆర్ఎస్ జోరు కొనసాగింది. 90 పైచిలుకు స్థానాల్లో టిఆర్ఎస్ గెలవబోతున్నట్లు కౌంటింగ్ సరళినిబట్టి తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా బద్ధలు అవుతున్నాయి. కాంగ్రెస్ పెద్ద లీడర్లు, సిఎం అభ్యర్థులే ఎదురీదుతున్నారు. గద్వాలలో డికె అరుణ రౌండ్ రౌండ్ కూ వెనుకబడుతున్నారు. నాగారర్జున సాగర్ లో జానారెడ్డి పరిస్థితి కూడా అదే. ఆందోల్ లో దామోదర రాజనర్సింహ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఇక జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. 16 వేల పైచిలుకు మెజార్టీ ప్రత్యర్థికి రాగానే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికే అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి బండి సంజయ్ గెలిచినట్లు వెల్లడైంది. జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
ఇక బండి సంజయ్ 30వేల ఆధిక్యంతో జీవన్ రెడ్డి మీద గెలుపొందారు. జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మంత్రిగా పనిచేశారు. పెద్దగా అవినీతి ఆరోపణలు లేని కాంగ్రెస్ నేత. అయితే ఆయన సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేయడం తో సహజంగానే ఆయన వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఓటమిపాలైన తొలి నాయకుడుగా జీనవ్ రెడ్డి నిలిచారు.