దారుణమైన ట్రోలింగ్: రాంగ్ ట్రాక్‌లో షర్మిల రాజకీయం.?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ చాలామంది ట్వీట్లేశారు. అందులో తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయ ప్రత్యర్థులైనవారూ వున్నారు. కానీ, వారెవరూ కేటీయార్ మీద సెటైరికల్ ట్వీట్లేయలేదు. షర్మిల మాత్రం ఛాన్స్ తీసుకున్నారు. అభ్యంతకరమైన ట్వీటే వేశారు కేటీయార్ మీద. ‘కేసీయార్ కొడుకు..’ అని వెటకారంగా షర్మిల వేసిన ట్వీట్ పట్ల గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. రిపోర్ట్ కొట్టారు.. దాంతో, ఆ ట్వీట్ ఎగిరిపోయింది.

మరోపక్క, షర్మిలపైనా గులాబీ శ్రేణులు జుగుప్సాకరమైన రాతలతో ట్వీట్లేశాయి. వాటిల్లో, ‘అనిల్ శాస్త్రి రెండో భార్య షర్మిల..’ అనే ప్రస్తావనతోపాటు, వేలమంది ఉసురు తీసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జైలు పక్షి జగన్ చెల్లెలు.. అంటూ గులాబీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. దాంతో, షర్మిల వ్యూహం బెడిసికొట్టినట్లయ్యింది. అయితే, షర్మిల ఏమాత్రం తగ్గేది లేదంటూ, తిరిగి పాత ట్వీటు తాలూకు స్క్రీన్ షాట్ పోస్ట్ చేశారు. పైగా, ‘పాపులర్ డిమాండ్ మేరకు..’ అంటూ పేర్కొన్నారు ఆ ట్వీట్ ద్వారా. ఇంకేముంది, మళ్ళీ వివాదం షురూ.

తెలంగాణలో షర్మిల చేసే రాజకీయం, ఆంద్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. తెలంగాణలో నిరుద్యోగుల తరఫున షర్మిల చేసే ఒక్కో వ్యాఖ్యా.. తెలంగాణ ప్రభుత్వానికి గట్టిగా తగులుతోందో లేదోగానీ, వైఎస్ జగన్ సర్కారుకి మాత్రం తగులుతోంది. షర్మిల ట్వీట్లను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిక వ్యతిరేకంగా పోస్ట్ చేస్తున్నారు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నెటిజన్లు. చూస్తోంటే, తెలంగాణలో షర్మిల రాజకీయం చెల్లేలా లేదు.. అదే ఏపీలో ఆమె రాజకీయం చేస్తే, ఫాలోయింగ్ బాగానే పెరుగుతుందేమో.