రాష్ట్రం కరోనా కంటే ఎక్కువ ఇంటరెస్ట్ గా ఏదైనా విషయం ఉందంటే అదే మూడు రాజధానుల అంశం. మూడు రాజధానుల అమలుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ముద్ర వేయించుకున్నారు. దీంతో ఈనెల 16న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానం పంపారని, రావడానికి మోడీ కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ ప్లాన్ కు హై కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ నిర్ణయంపై స్టేటస్ కో విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవడం వల్ల ఈనెల 16న రాజధాని శంకుస్థాపనకు నిర్ణయయించిన ముహూర్తం వాయిదా పడేలా ఉందని సమాచారం.
అయితే రానున్న విజయదశమికి మరొక ముహూర్తం ఫిక్స్ చేశారని రాజకీయ వర్గాలు చరించుకుంటున్నారు. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు రాకపోవడానికి లాయర్ల తప్పదమని గుర్తించిన జగన్ దీనిపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తరుపున హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శ్యామలరావు నేతృత్వంలో మరో అధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జగన్ ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగుల విషయంలో, డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే తాజగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మళ్ళీ కోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పులు చేయదని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాజధాని విషయంలో చివరికి అమరావతి రైతులు విజయం సాధిస్తారా? లేక వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.