HomeNewsఇదేం ట్విస్టు.."కేజీఎఫ్ 2" షూట్ ఇంకా అవ్వలేదా?

ఇదేం ట్విస్టు..”కేజీఎఫ్ 2″ షూట్ ఇంకా అవ్వలేదా?

With Twist Kgf 2 Shoot Still Going Now | Telugu Rajyam

మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి మొత్తం ఇండియన్ సినిమానే షేక్ చెయ్యడానికి రెడీగా ఉన్న అతి కొద్ది సినిమాల్లో రాకింగ్ స్టార్ యాష్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి లు నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నిజానికి ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది. కానీ కరోనా ఇతర కారణాల మూలాన అలా వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కూడా చిత్ర యూనిట్ ఖరారు చేశారు. ఇక అన్నీ పూర్తయ్యాయి పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతున్నాయి అనుకుంటే ఊహించని ట్విస్ట్ వచ్చింది ఇప్పుడు.

ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుందట. ప్రస్తుతం బెంగళూరులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ భువన్ చెప్పడమే హాట్ టాపిక్ గా మారింది. మరి ఇదొక్క షూట్ మాత్రమేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News