Blood: మానవ శరీరంలో రక్తం ప్రధాన విధి ఏమిటి.. రక్తం లేకపోతే శరీరం ఏమవుతుందో తెలుసా?

Blood: శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి రక్తం చాలా అవసరం . మన శరీరానికి రక్తం ఇంధనం లాగా పనిచేస్తుంది. ఒకవేళ మన శరీరంలో రక్తం లేకపోతే ఏం జరుగుతుందో.. ఈ విషయం మన ఊహలకి కూడా అందదు. శరీరంలో రక్తం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా అయితేనే శరీర అవయవాలన్నీ వాటి విధులు నిర్వహిస్తాయి. ఒకవేళ మన శరీరంలో రక్తం లేకపోతే ఎంత ప్రమాదమో కదా.. ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. మనం తిన్న ఆహారం నుండి లభ్యమయ్యే గ్లూకోజ్ శరీర అవయవాలకు చేరటం వల్ల పనులు చేయడానికి మనకి శక్తి లభిస్తుంది. రక్తం ఆహారం నుండి వెలువడే గ్లూకోజ్ నీ శరీర భాగాలన్నింటికీ చేరుస్తుంది.

మనం జీవించాలి అంటే ఆహారం తీసుకోవటం ఎంత అవసరమో శ్వాస తీసుకోవడం కూడా అంతకన్నా అవసరం. మనం తీసుకునే ఆక్సిజన్ మన శరీర అవయవాలకు చేరాలంటే సహాయం కచ్చితంగా ఉండాలి. రక్తంలో ఆక్సిజన్ తొందరగా కరిగిపోయి మన శరీర అవయవాలకు చేరుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటంవల్ల అది అయస్కాంత గుణం కలిగి ఉంటుంది. ఆక్సిజన్ లోని అయస్కాంత గుణం వల్ల హిమోగ్లోబిన్ ,ఆక్సిజన్ రెండూ కలిసిపోయి శరీర అవయవాలకు చేరుతాయి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మన శరీరానికి గాయం అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ కాకుండా రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీపవర్ ఎక్కువగా ఉండి రోగాలతో పోరాడే శక్తి ఉంటుంది. మన శరీరంలో రక్తం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తం లేకపోతే మానవుడు జీవించలేడు.