కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా అంటున్నాడు.. మరి రికవరీ ?

What imare Kalyan Ram plans on his pan india movie
What imare Kalyan Ram plans on his pan india movie
 
జేబులో డబ్బులు ఉంటే సినిమా తీయాడం ఈజీనే.  కానీ వాటిని వెనక్కి రాబట్టాలంటే.. సరైన ప్లానింగ్ ఉండాలి. ఏ హీరోతో చేస్తున్నారు, అతని మార్కెట్ ఎంత, ఇతర భాషల్లో ఏమేరకు మార్కెట్ పుల్ చేయగలడు, యూనివర్సల్ కథా కాదా అనే విషయాలను తప్పనిసరి చూసుకోవాలి. లేకుంటే నష్టాలు తప్పవు.  ఈరోజుల్లో ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా మీద ఆసక్తిగా ఉన్నారు. భారీ కథతో పెద్ద సినిమా చేసి అనేక భాషల్లో రిలీజ్ చేయాలని తపిస్తున్నారు.  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడ ఇదే తరహాలో సినిమా చేస్తున్నారు.  ఇంకొద్ది గంటల్లో టైటిల్ రీవీల్ కానుంది.  
 
ఇది చిన్నా చితకా సినిమా ఏమీ కాదు.  పాన్ ఇండియా మూవీ.  టైమ్ ట్రావెల్ కథ.  టైమ్ ట్రావెల్ అంటే అన్ని ప్రాంతాలకు, భాషలకు సెట్టయ్యే కథ.  సో.. కథ పరంగా నో ఇష్యుస్.  బడ్జెట్ విషయంలోనే కాస్త కంగారు.  కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ మీదే సినిమా నిర్మితమవుతోంది.  బడ్జెట్లో హెవీగానే ఉంటుందని తెలుస్తోంది.  హెవీ అంటే కళ్యాణ్ రామ్ మార్కెట్ స్థాయికి దాదాపు ఒకటిన్నర నుండి రెండు రెట్లు ఎక్కువని అంటున్నారు.  మరి అంత పెడితే వెనక్కి వస్తుందా అంటే డౌటే.  కానీ కళ్యాణ్ రామ్ పెట్టేస్తున్నాడు.  
 
ఇతర భాషల్లో ఆయన మార్కెట్ సున్నా.  పోనీ డైరెక్టర్ పేరు మీద సేల్ చేస్తారా అంటే అతనూ కొత్తవాడే.  కాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ అంత ఈజీ కాదు.  ఈ లెక్కన సినిమాను పక్కాగా హిట్టయ్యేలా తెరకెక్కించి భారీ లెవల్లో ప్రమోషన్లు చేస్తే తప్ప సర్వైర్ అవ్వడం కష్టం.  మరి కళ్యాణ్ రామ్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి.