మొట్టమొదటి సారిగా బాలకృష్ణ ఊహించని నిర్ణయం..!

బాలకృష్ణ పేరు వింటేనే మాస్ పూనకాలు స్టార్ట్ అవుతాయి అందరికీ ఆఫ్ స్క్రీన్ లో ఏమో కానీ ఆన్ స్క్రీన్ లో బాలయ్య కి సరైన సినిమా పడితే కనుక దాని రచ్చ ఇంకో స్థాయిలో ఉంటుంది. అలాంటి సినిమాగా తన దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న భారీ సినిమా “అఖండ”ని నేటితో కంప్లీట్ చేసేసారు.

అయితే ఇదిలా ఉండగా బాలయ్య అసలు ఊహించని విధంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొట్టమొదటి సారిగా నందమూరి బాలయ్య ఓ ఓటిటి షో లో కనిపించి సందడి చేసేందుకు రెడీగా ఉన్నారట.

ఓ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థతో ఆల్రెడీ బాలయ్య టచ్ లో ఉన్నారని దాని తాలూకా షూట్ సహా ఇతర వివరాలు ఇంకొన్ని రోజుల్లోనే బయటకి రాబోతున్నట్టుగా ఇపుడు తాజా బజ్. దీనితో పాటుగా బాలయ్య మరిన్ని ఆసక్తికర సినిమాలు చేయబోతున్నా ఓటిటి లోకి దిగడం ఓ షో కి తానే హోస్ట్ గా ఒప్పుకోవడం అనేది అసలు ఎవరూ ఊహించనటువంటిదే..