Vijay Devarakonda : రౌడీ హీరోపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..కథ ఏంటంటే

Vijay Devarakonda : ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ అగ్రెసివ్ హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. అయితే విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ స్టార్ నటులు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్ అని చెప్పాలి.

అక్కడ హాట్ హీరోయిన్ లు అందరికీ కూడా విజయ్ నే హాట్ కేక్ ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఈ లిస్ట్ లో ఇప్పుడు ఇంకో హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ చేరింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ నుంచి అయితే ఎవరితో నటించాలని అనుకుంటున్నారని అడగ్గా.. దానికి విజయ్ దేవరకొండ పేరు చెప్పింది ఈ అమ్మడు.

విజయ్ చాలా హాట్ అండ్ కూల్ గా ఉంటాడని అతడితో అయితే సినిమా చేస్తానని సారా చెప్పింది. అయితే సారా కూలి నెంబర్ 1, టెంపర్ రీమేక్ ‘సింబా’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మరి అలాగే ప్రస్తుతం విజయ్ తన పాన్ ఇండియన్ సినిమా లైగర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.