చిరు, చరణ్ లతో థియేటర్స్ షేక్ అయ్యే సాంగ్!

మెగాస్టార్ చిరంజీవి (చిరు) అలాగే కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఊహించని మల్టీ స్టారర్ ను దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేసాడు. అదే “ఆచార్య”. మొదటగా చరణ్ రోల్ ని చిన్నగానే అనుకున్నా ఆ తర్వాత కథలో లీనమయ్యే పాత్రగా మారిపోయింది. అయితే ఇక మెగా మల్టీ స్టారర్ అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు.

ఇంకా చెప్పాలంటే మెగా కుటుంబం నుంచి అదిరే డాన్స్ ని అభిమానులు కోరుకుంటారు. అలా డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మెగా కుటుంబం అలరిస్తూ వస్తున్నారు. కానీ ఆచార్యలో చిరు మరియు చరణ్ లతో చేసిన ఓ సాంగ్ థియేటర్స్ ని షేక్ చెయ్యడం ఖాయం అని తెలుస్తుంది.

రీసెంట్ గానే ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో పూర్తి అయ్యినట్టు సమాచారం వచ్చింది. ఇక ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందట. అంతే కాకుండా ఈ పాటలో చిరు చరణ్ కలిపి వేసే ఓ పర్టిక్యులర్ స్టెప్ కి ఆడియెన్స్ నుంచి మామూలు రెస్పాన్స్ రాదట. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ వైరల్ అవుతుంది.