Omicron: శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్.. కారణాలను వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ..!

Omicron: ప్రపంచ దేశాలలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది . ప్రపంచ దేశాలలో ప్రతిరోజు ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెంది ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది . కరోనా మునుపటి వేరియంట్ లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా తేలిక పాటి లక్షణాలను కలిగి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలలో ఒమిక్రాన్ వ్యాప్తి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది . తాజాగా ఈ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలను డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

కరోనా డెల్టా వేరియంట్ లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉండి ప్రజలు ఆక్సిజన్ కొరత తో చాలా ఇబ్బంది పడ్డారు . డెల్టా వేరియంట్ తో పోల్చితే ఒమిక్రాన్ 30 శాతం ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాల కన్నా తేలికపాటి గా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ ప్రజలను భయపెడుతోంది.

WHO టెక్నికల్ చీఫ్ మరియా వాన్ కెర్ఖోవ్ శుక్రవారం ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందటానికి గల కారణాల గురించి వివరించారు . గతవారం రికార్డు స్థాయిలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి . ఒమిక్రాన్ వేరియంట్ అనేక కారణాల వల్ల ప్రజలలో మునుపటి కంటే 71% కేసులు ఎక్కువగా వ్యాపించాయని వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు . డబ్ల్యూహెచ్వో ఒమిక్రాన్ వ్యాప్తికి గల మూడు కారణాలను వెల్లడించింది.

*మొదట, కొత్త వేరియంట్‌లోని ఉత్పరివర్తనలు వైరస్ మానవ కణాలతో సులభంగా బంధించడానికి సహాయపడతాయి.
*రెండవది, కొత్త వేరియంట్ రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ప్రజలు మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అంటే, ఇంతకు ముందు వ్యాధి సోకిన వారు , టీకాలు వేయించుకున్న వారికి కూడా ఒమిక్రాన్ నీ నివారించటం కష్టం .
* “ఓమిక్రాన్‌లో వైరస్ ఎగువ శ్వాసకోశంలో పునరావృతం కావడాన్ని మేము చూస్తున్నాము, ఇది డెల్టా లేదా మునుపటి వేరియంట్‌ల నుండి పూర్తిగా భిన్నమైన విషయం.” కరోనా యొక్క మునుపటి అన్ని వేరియంట్స్ ఊపిరితిత్తులలోని దిగువ శ్వాసకోశంలో ప్రతిరూపం పొందాయి, ఇది దాని పురోగతిని మందగించింది. అని కెర్ఖోవ్ చెప్పుకొచ్చారు .
* వీటన్నింటితో పాటు ప్రజలు కరోనా వ్యాధి వ్యాపించకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.