ఆహాహా.! సమంత రేంజ్ తగ్గేదే..లె!

ఆల్రెడీ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ కోసం ఓటీటీ ఛానెల్‌లో అడుగు పెట్టింది సమంత. ఈ సిరీస్‌లో సమంత పోషించిన రాజీ పాత్ర మొదట్లో కాంట్రవర్సీలకు దారి తీసినా, నటన పరంగా మంచి మార్కులేయించుకుని పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందట సమంతకు.

ఈ సారి ‘ఆహా’ ఛానెల్ నుండి ఓ వెబ్ సిరీస్ కోసం సమంతతో సంప్రదింపులు జరుగుతున్నాయట. సమంత ఇంకా ఓకే చేయలేదు. కానీ, ఒప్పుకునే దిశలోనే అడుగులు కదుపుతోందట. ఈ వెబ్ సిరీస్ కోసం భారీ రెమ్యునరేషన్ సమంతకు ఆఫర్ చేశారట ఆహా టీమ్.

ఆల్రెడీ ‘సామ్ జామ్’ టాక్ షో తో సమంతకు ‘ఆహా’ ఛానెల్‌తో సంబంధం ఉంది. ఆ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సారి సామ్‌తో ఓ ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్ రూపొందించాలని ఆహా టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తోందట. చూడాలి మరి, సమంత సైన్ చేస్తుందా.?

మరోవైపు బిగ్ తెరపై సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ, రేపో మాపో రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సినిమాకి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.