తెలంగాణాలో మొదలైన నిరసన సెగలు.. ఇకనైన ఈ దోపిడి ఆపండి దొర అంటున్న ప్రజలు.. ??

 

ఛీ దినమ్మ జీవితం రోజు రోజుకు పేదల బ్రతుకులు దరిద్రంగా కిందికి దిగజారి పోతుంటే పట్టించుకునే వారే లేరని తెలంగాణా ప్రజలు వాపోతున్నారట.. ఇప్పటికే కరోనా వచ్చి ఆర్ధికంగా కోలుకోని దెబ్బవేయగా, పూటగడవని పరిస్దితులను ఎందరో ప్రజలు ఎదుర్కొంటున్నారు.. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టుగా ఉద్యోగుల ఖర్చులకు సరిపడా జీతాలు లేవు గాని అన్ని నిత్యవసరాల మీద రెట్లు మాత్రం భారీగానే పెరిగాయి.. వచ్చే ఆదాయం కన్నా పూటగడవడం కోసం చేసే ఖర్చులే సామాన్యున్ని వెక్కిరిస్తున్నాయి.. ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ప్రజలకు కేసీయర్ సర్కార్ చేసింది ఏమైనా ఉందా అంటే వారికి పదవుల మీద ధ్యాస తప్ప ప్రజల మీద ధ్యాసలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఇక పాలకుల సంగతి అయితే చెప్పనవసరం లేదు.. దున్నే భూమి మనదైతే చాలు ఎలాగైన దున్నవచ్చు అనే తీరుగా ఉన్నారంటున్నారట తెలంగాణ ప్రజలు.. ఇలాంటి ఒడిదుడుకుల బ్రతుకులకు గట్టిగానే వాతలు పెట్టే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పేదలను మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది అంటున్నారు.. ఇకపోతే వీఆర్వో వ్యవస్దను రద్ధు చేసిన ప్రభుత్వం కొన్ని రోజుల వరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆపిన విషయం తెలిసిందే.. ఇందుకు గాను కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే రూల్ పెట్టింది.. ఇక టీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ ప్రజలను దోచుకునేందుకే ఎల్‌‌ఆర్‌‌ఎస్ తెచ్చిందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తుంది..

అసలే కరోనా ఎఫెక్ట్‌‌తో కష్టాల్లో ఉన్న ప్రజల నడ్డివిరిచేలా ఉన్న జీవో నంబర్ ​131ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్దార్ ఆఫీసుల ఎదుట నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి.. అంతే కాకుండా ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ వసూల్ పై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూంపైన లేదని, ఫర్మిషన్ లేకుండా జరిగిన లే అవుట్లపై అప్పుడు ఎందుకు స్పందించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు నిరసనసెగ తగిలింది. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

పట్టణంలోని ఐబీ కార్యాలయం ఆవరణలో వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన దుకాణాలను మంత్రి ప్రారంభిస్తుండగా ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వక్ర బుద్ది మానుకొని ప్రజలను పీడించడం ఆపాలని, ప్రజల సంక్షేమం కోసం పథకాలు తీసుకురాకుండా, తిరిగి పేదప్రజలను దోచుకునే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు.. మరి చూడాలి ముందు ముందు ఈ ఎల్‌‌ఆర్‌‌ఎస్ అనే నిప్పు ఎంత వరకు వ్యాపిస్తుందో..