అమరావతి:తాను రాజధానిగా నియమించిన అమరావతినే రాష్ట్రానికి రాజధానిగా ఉంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి కోసం తన పార్టీ నాయకులతో కలిసి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తాముతీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉంటే వైసీపీ నాయకులు కూడా రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం మళ్ళీ ఎన్నికల కోసం ప్రజల వద్దకు వెళ్లాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే ఈ సవాల్ ను సీరియస్ గా తీసుకోని వైసీపీ నాయకులు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
రాజధాని క్రెడిట్ కొట్టేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే సహకరించడం లేదని విశ్వసనీయత వర్గాల సమాచారం. పార్టీలోని ఎమ్మెల్యేలకు నారా లోకేష్ సర్ది చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేగా గెలవని నువ్వు తమకు సలహాలు ఇవ్వడం ఏంటని తిడుతున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే కనీసం రెండేళ్లు కూడా గడవకుండా రాజీనామాలు చేయడం ఏంటని పార్టీలోని సీనియర్ నాయకులు చంద్రబాబుకు ఫోన్ చేసి తిడుతున్నారట. ఒకవేళ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు అమరావతి సెంటిమెంట్ వర్క్ ఔట్ కాకపోతే తమ పరిస్థితి ఏంటని చంద్రబాబునే నిలదిస్తున్నారని సమాచారం.
చంద్రబాబు మాత్రం అమరావతి సెంటిమెంట్ వర్క్ అవుతుందని, ఈసారి ఓడిపోయే అవకాశమే లేదని చెప్తున్నా కూడా తెలుగు తమ్ముళ్లు వినడం లేదంట. మరీ అంత అవసరమైతే మీరు ఒక్కరు రాజీనామా చేస్తే సరిపోతుందని, దానికి తమను కూడా రిస్క్ లో పెట్టడం ఎందుకని బాబుకు సలహాలు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తన పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని, తన పార్టీ పెద్దలే తనకు ఫోన్ చేసి తిడుతుందటతో ఏమి చెయ్యాలో తోచని చంద్రబాబు తల పట్టుకున్నాడట. మరి రానున్న రోజుల్లో బాబుకు తెలుగు తమ్ముళ్లు సహకరిస్తారో లేదో వేచి చూడాలి.