ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడుగు..బలహీన వర్గాల అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నారు. రైతే రాజుగా, నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో ముందుకుసాగిపోతున్నారు. దీనిలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న పేదలను గుర్తించిన ముఖ్యమంత్రి వాళ్లందరికి ఉచితంగా ఇల్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిశగా పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రాష్ర్టంలో ఉన్న ఖాళీ భూమిని చదును చేసి ఇళ్లు కట్టించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అయితే టీడీపీ తమ్ముళ్లు ఇక్కడా రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చి తాగడమే పనిగా పెట్టుకున్నట్లు తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లను బట్టి అర్ధమవుతోంది. కాకినాడ సముద్ర తీరం వద్ద ఎందుకు పనికి రాని మడ అడవులను నరికి చదును చేసి ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇప్పటికే అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
తీరం రక్షణకు వరంగా పరిమణించిన మడ అడవుల్లోకి, ఉప్పు నీటి కాలువల్లోకి వ్యర్ధ, రసాయనాలు చేరకుండా అరికట్టాల్సిన ప్రభుత్వ స్థానంలో ఉండి..పేదలకు ఇంటి స్థలాల అవసరం అని ! అడవులనే నరికేస్తారా? అంటూ విమర్శించారు. దీంతో ఈయన తీరుపై వైకాపా నేతలు, నెటి జనులు విరుచుకుపడ్డారు. టీడీపీ వాళ్లకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడం ఇష్టం లేనట్లుంది? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాకినాడ లో ప్రభుత్వం గుర్తించిన స్థలంలో కంపెనీలకు గానీ, ఇతర ఆవాసాలకు దేనికి ఇబ్బంది లేకుండా ఉంది. వాటన్నింటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అక్కడ పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ధారించినట్లు పచ్చ తమ్ముడికి గుర్తు చేసారు. ఇలాంటి మంచి పనులు మీరు చేయరు? చేయనివ్వరు? చేసేవాళ్లను చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మాత్రం వచ్చు అంటూ మండిపడుతున్నారు.