మగాళ్ళేనా సిక్స్ ప్యాక్ ఫిజిక్ సాధించేది.? నేనేం తక్కువ కాదు.. అంటోంది నటి తాప్సీ. ‘రష్మి రాకెట్’ సినిమా కోసం తాప్సీ చాలా కష్టపడింది. చాలా కాదు.. చాలా చాలా కష్టపడింది. వర్కవుట్స్ చేయడంలో తాప్సీ ఇంతకు ముందు కంటే చాలా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
అథ్లెట్‌గా నటించాల్సి రావడమంటే ఏ నటికి అయినా, నటుడికి అయినా కత్తి మీద సాములాంటిదే. హీరోలతో పోల్చితే, హీరోయిన్లకి అది ఇంకా కష్టం. చాలా అరుదుగా మాత్రమే అథ్లెట్స్ పాత్రల్లో హీరోయిన్లు నటిస్తుంటారు. ఎందుకంటే, అథ్లెట్స్‌గా కనిపించేందుకోసం చేసే వర్కవుట్లు హీరోయిన్ల ‘ఫిగర్’ని పాడు చేస్తాయ్ మరి.
అయితే, తాప్సీ అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోలేదు. పురుషులెలాగైతే సిక్స్ ప్యాక్ ఫిజిక్ కోసం కష్టపడతారో.. అంతకు మించి కష్టపడింది తాప్సీ. ఇంతకీ సిక్స్ ప్యాక్ వచ్చిందా.? లేదా.? అంటే, దాదాపుగా సాధించేశానంటోంది తాప్సీ.
‘ఆ పాత్రకి అవసరం కొంతవరకు మాత్రమే.. ఎంతవరకు కావాలో అంతా చేసేశా.. ఆ విషయంలో మగాళ్ళ కంటే నేనేం తక్కువ కాదని నిరూపించుకున్నా..’ అని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.