సూపర్ పవర్ మల్టీ స్టారర్ కోసం రంగం సిద్ధమవుతోందా.?

నిజమేనా.? ఈ గాసిప్ నిజమైతే అది తెలుగు సినీ పరిశ్రమలో మరో అతి పెద్ద మల్టీ స్టారర్ అవుతుందన్నది నిర్వివాదాంశం. అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు కూడా. ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా.? ఇంకేంటి, సూపర్ పవర్ కాంబినేషన్.

తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హీరోల అభిమానుల మధ్య కొట్లాటలు ఒకప్పుడు చాలా గట్టిగా వుండేవి.. అవి ఈ మధ్య మరింత జుగుప్సాకరంగా మారాయి. అదే సమయంలో, చాలామంది అభిమానులు మాత్రం, తమ తమ అభిమాన హీరోలు కలిసి వుండాలని కోరుకుంటున్నారు.

అసలు విషయమేంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు.. కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. ఓ స్టార్ డైరెక్టర్ ఈ కాంబోలో సినిమా తెరకెక్కించడం కోసం సన్నాహాలు చేస్తున్నాడట. ఆ స్టార్ కాంబో, ఇప్పటికే.. ఈ ఇరువురి హీరోలతో విడివిడిగా సినిమాలు చేసి హిట్లు కొట్టాడు.

ఓ ప్రముఖ నిర్మాత ఈ కాంబినేషన్ సెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, సంక్రాంతికి ఈ కాంబినేషన్ విషయమై ప్రకటన రావొచ్చంటున్నారు. కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. నో డౌట్స్.