పవన్ ఏం తప్పు చేశాడని ఆవిడ అంతలా తిట్టి పోసింది ?

ఇన్నాళ్లు టీవీ ఛానళ్లకు, పత్రికలకు మాత్రమే  పరిమితమైన మాటల దాడి ఇప్పుడు సోషల్ మీడియాలోకి చేరింది.  రాజకీయ నాయకులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే దెబ్బలాడుకుంటున్నారు.  జనం ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే ఉండటంతో పరస్పరం ప్రతిష్టను దెబ్బతీసుకోవడానికి పొలిటికల్ లీడర్లకు అవే   వేదికలయ్యాయి.  ఇక పవన్ కు రెగ్యులర్ మీడియాలో కవరేజ్ బ్యాన్ కాబట్టి ఇతర పార్టీల వారు ట్విట్టర్ వేదికగా పవన్ మీద అన్ని విధాలుగా దాడి చేస్తున్నారు.  అమరావతి రాజధానిగా ఉండాలని అసైన్డ్ భూముల రైతుల తరపున పోరాటం చేస్తున్న  లాజర్ అనే పెద్దాయన ఇటీవలే కన్నుమూశారు.  దాంతో పవన్ లాజరస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి పులి చినలాజర్ గారికి అసలైన నివాళి దక్కాలంటే అమరావతి పోరాటాన్నిబలోపేతం చేయాలని అన్నారు. 

 Social media attack on Pawan Kalyan ,Pawan Kalyan
 Social media attack on Pawan Kalyan ,Pawan Kalyan

నిజానికి పులి చినలాజర్ గారితో పవన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.  అసైన్డ్ భూముల రైతుల  సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లింది ఆయనే.  ఆయనతో కలిసి పవన్ పలు నిరసనలో, కార్యక్రమాల్లో ఒకే వేదికను పంచుకున్నారు. లాజర్  సొంత గ్రామం ఉద్దండరాయునిపాలేంలోనే పవన్ ఉగాది వేడుకలు చేసుకున్నారు.  ఆయనతో లాజర్ సైతం వేడుకల్లో పాల్గొన్నారు.  ఆ అనుబంధంతోనే పవన్ ఆయనకు సంతాపం తెలుపుతూ ఆయన చేసిన పోరాటం యొక్క గొప్పతనాన్ని  ప్రస్తావించారు.  ఇందులో తప్పేం లేదు.  ఎవరైనా ప్రజానాయకుడు కన్నుమూస్తే ఆయనతో సత్సంబంధాలున్న వ్య్వక్తులు ఎవరైనా ఇలాగే స్పందిస్తారు.  కానీ పవన్ స్పందన పట్ల లాజర్  కుమార్తె ఎస్తేర్ తీవ్రంగా స్పందించారు. 

 Social media attack on Pawan Kalyan ,Pawan Kalyan
 Social media attack on Pawan Kalyan ,Pawan Kalyan

తన తండ్రి రాజధాని పోరాటంలో ఆయన గుండె ఆగిపోలేదని, ఆనారోగ్యంతోనే కన్నుమూశారని చెప్పుకొచ్చిన ఆమె పవన్ తన తండ్రి అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకున్నారని, పొగడ్తలతో పబ్బంగ డుపుకున్నారని, ఎన్నికల్లో  ఓడిపోయాక ఏ పంచన చేరావని, తన తండ్రి మరణాన్నిస్వార్థ రాజకీయం కోసం వాడుకోవద్దని  అంటూ ఓ స్థాయిలో మండిపడ్డారు.  ఇక పవన్ వ్యతిరేక వర్గాలు తమ పని మొదలుపెట్టాయి.  పవన్ సంతాపం తెలిపింది రాజకీయ స్వార్థంతోనేనని ప్రచారం మొదలుపెట్టాయి.  అయినా ఒక్క సంతాప తెలపడం వలన పవన్ రాజకీయంగా పొందే లబ్ది ఏముంటుందో ఆయన మీద విరుచుకుపడుతున్నవారికే తెలియాలి. ఇక సామాన్యులైతే నివాళు అర్పించడం తప్పా, పవన్ వేసిన ట్వీట్లో స్వార్థం ఏముంది.  అయినా లాజరస్ మరణం గురించి, ఆయన పోరాటం గురించి పవన్ తప్ప వేరే రాజకీయ నాయకుడు ఎవరైనా మాట్లాడారా, అనవసరంగా ఆయన మీద తిట్ల పురాణం ఎత్తుకున్నవారు చేసేదే స్వార్థ రాజకీయం  కదా అంటూ సందేహాలను వెలిబుచ్చుతున్నారు.