Sleep Less: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పనిపై పడి రాత్రి పగలు అనే తేడా లేకుండా జీవనం కొనసాగిస్తూ సంపాదనలో పడుతున్నారు. ఈ క్రమంలోనే నిద్ర కూడా దాదాపు తక్కువగానే నిద్రపోతూ అనేక ఒత్తిడికి గురవుతున్నారు.ఇలా మన కంటికి శరీరానికి సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని అంతకన్నా తక్కువగా నిద్రపోతే ఎన్నో సమస్యలు వెంటాడతాయి నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ సమస్య ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
తక్కువ సమయం పాటు నిద్ర పోవడం వలన మనం అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వైద్య సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇలా తక్కువ
సమయం పాటు నిద్ర పోవడం వలన కళ్ళమీద ఒత్తిడి పెరిగి నిద్రలేమి, సైట్, అలాగే చాలా రకాల కంటి సమస్యలు, వంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట.తక్కువ నిద్ర కారణంగా బలహీనంగా మారిపోవడం మెదడు పనితీరు చురుకుదనం తగ్గి పోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. వీటితో పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందట.
వైద్య పరీక్షలు తెలియజేస్తున్న దాని ప్రకారం తక్కువ సమయం పాటు నిద్ర పోవడం వలన జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా రావచ్చును. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లో ఉపయోగం వలన కూడా తక్కువగా నిద్ర పోవడం జరుగుతుంది. ఈ కారణంగా కంటి చూపు మందగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.కావున సరైన సమయం నిద్రపోవడం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు కంటి సమస్యల నుంచి ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చును మన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి ఎక్కువ నిద్ర అవసరమని మనం ఇప్పటికైనా తెలుసుకుందాం.