షాకింగ్ : విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం..వారు ముందుకు రావాల్సిందే

Shockingly Shiva Shankar Master Hospitalized | Telugu Rajyam

దక్షిణాదికి చెందిన ఎన్నో అద్భుత సినిమాలకు తన క్లాసికల్ డాన్స్ తో మంచి కొరియోగ్రఫీ అందించిన సీనియర్ డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ అకస్మాత్తుగా కరోనా బారిన పడటం ప్రతి ఒక్కరినీ బాధ కలిగించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు కానీ వారి ఆర్ధిక పరిస్థితులు అసలేం బాగోలేవట. అందుకే వారి కుమారుడు అజయ్ కృష్ణ మాత్రమే వారి ఆరోగ్య పరిస్థితులను చూసుకుంటున్నాడు.

కానీ హాస్పిటల్ కి మాత్రం ప్రతిరోజు లక్ష వరకు ఖర్చు అవుతుండడంతో వారి దగ్గర అంత మొత్తం లేకపోవడంతో సినీ వర్గాల్లో పి ఆర్ లు సోషల్ మీడియాలో వారి డీటెయిల్స్ తో సాయం చేయాలి అనుకునే వారు చెయ్యొచ్చని ఓ నెంబర్ కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ సమయంలో ఆయన్ని సినీ పెద్దలే ముందుకు వచ్చి ఆదుకోవాల్సి ఉంది.

ఎన్నో సినిమాలకు అద్భుతమైన నాట్యం అందించడమే కాకుండా పలు సినిమాలు సీరియల్స్ లో కూడా శివశంకర్ మాస్టర్ నటించారు. మరి వారు త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు వరకు ఈ విషయం వెళ్లి సాధ్యమైనంత త్వరగా బ్రతికించుకోవాలని ఆశిద్దాం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles