గుడ్ న్యూస్ : ఫైనల్ గా కరోనా నుంచి కోలుకున్న బాలయ్య, రవితేజ నటి..!

Varalaxmi Sarathkumar New Pictures

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో కూడా దీని ప్రభావం కనపడుతుండడం పలువురు స్టార్ నటీనటులు పాజిటివ్ అవుతుండడంతో మళ్ళీ ఆందోళన నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితమే సౌత్ ఇండియా స్టార్ నటి అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కరోనా బారిన పడినట్టుగా తెలిపి తన షాకింగ్ అనుభవాన్ని దీనంగా తెలిపింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈమె టెస్ట్ చేయించుకోగా ఫైనల్ గా మళ్ళీ నెగిటివ్ అయ్యినట్టుగా తెలిపి ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఒక వీడియో ద్వారా తాను ఇప్పుడు కరోనా నెగిటివ్ అయ్యానని ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపింది. అయితే అయినా కూడా అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మానొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మొత్తానికి అయితే ఈసారి కరోనా సోకినా కూడా పెద్దగా చింతించాల్సిన పని లేదనే ఒక గుడ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది అనే చెప్పాలి.

కాకపోతే ముందు రెండు డోసులు వాక్సిన్ వేసుకున్న వారికే ఇది సాధ్యం అవుతుంది అని గుర్తించాలి. మరి రవితేజ క్రాక్ తో తెలుగు సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బాలయ్య తో సాలిడ్ ఏక్షన్ ఫిల్మ్ లో నటిస్తుంది.