Immunity Booster: కరోనా నిర్మూలించడానికి ఈ డ్రింక్స్ ఔషధంలా పనిచేస్తాయి..!

Immunity Booster: దేశంలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ మునుపటి వేరియంట్లో కంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మునుపటి వేరియంట్ లక్షణాలతో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ దీని వ్యాప్తి మాత్రం చాలా వేగంగా ఉంది. అందువల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో ఇమ్యూనిటీపవర్ ఎక్కువగా ఉండాలి. ఈ మహమ్మారి విజృంభన కట్టడి చేయటానికి పౌష్టిక ఆహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకునే కొన్ని డ్రింక్స్ వల్ల కరోనా కట్టడి చేయవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ఆహారపు అలవాట్లలో మార్పు,పని వత్తిడి, నిద్రలేమి వంటి అనేక కారణాల వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని పదార్థాలను ఉపయోగించి డ్రింక్స్ తయారుచేసుకొని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో రోగాలతో పోరాడే శక్తి ఏర్పడుతుంది.

ఇంట్లో వంట గదిలో అల్లం పసుపు నిమ్మకాయలు వంటి పదార్థాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఒక కప్పు నీటిలో కొంచెం అల్లం ఐదు నిమిషాల పాటు ఉడికించి అందులో వేప, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ తాగటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి అందులో తులసి ఆకులు, పుదీనా, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మరిగించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ నీటిని తాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి పుదీనా ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మ పండు లో సిట్రస్ ఉండటంవల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇలా మనకి అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఇంట్లో కషాయాలు చేసుకొని తాగటం వల్ల కరోనా దరిచేరదు.