కరోనా ఎఫెక్ట్ : సరిగ్గా ఒక్కరోజు ముందు అక్కడ ఆగిపోయిన బాలయ్య సినిమా.!

తాజాగా మన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ కి అనుకోని రీతిలో కరోనా ఎఫెక్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ వార్త అభిమానుల్లో షాకింగ్ గా మారగా సినీ పరిశ్రమకి చెందిన అనేక మంది ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య తన కెరీర్ లో 107వ సినిమాని మరి హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతానికి కూడా చేరుకోగా మేకర్స్ సరిగ్గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కి ముందు రోజే బాలయ్యకి కరోనా సోకినట్టు తెలుస్తుంది. 

ఇంకా వివరాల్లోకి వెళితే ఈరోజు జూన్ 25న కర్నూల్ లో భారీ షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అనుకోని విధంగా నిన్ననే ఈ సినిమా హీరో అయినటువంటి బాలయ్య కరోనా బారిన పడడంతో ఈ షూటింగ్ అంతా నిలిచిపోయింది. ప్రస్తుతానికి బాలయ్య ఆరోగ్యం బాగానే ఉన్నా ప్రోటోకాల్ ప్రకారం అయితే 14 రోజులు ఈ షూటింగ్ వాయిదా పడినట్టే అని చెప్పాలి. 

లేదా బాలయ్య లేని పోర్షన్ తాలూకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ కూడా హీరోయిన్ జాయిన్ కాగా థమన్ సంగీతం ఇస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.