Prabhas Movie Gone Leak : షాకింగ్ : ప్రభాస్ ఈ రెండు భారీ సినిమాల నుంచి లీక్ మీద లీక్ లు.!

Prabhas Movie Gone Leak : ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ అంచనాలతో ఉన్నాయో తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో రిలీజ్ కి “రాధే శ్యామ్” అనే సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ఆశ్చర్యకరంగా ఈ సినిమా నుంచి కాకుండా దీని తర్వాత స్టార్ట్ చేసిన రెండు సినిమాల నుంచి షాకింగ్ లీక్స్ బయటకి వచ్చినట్టు సినీ వర్గాల్లో గాసిప్స్ నడుస్తున్నాయి.

ఆ సినిమాలే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తీసిన భారీ ఇతిహాస చిత్రం “అదిపురుష్” మరొకటి కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ డ్రామా “సలార్”. ఇప్పుడు ఈ రెండు సినిమాల నుంచే రెండు షాకింగ్ లీక్స్ బయటకి వచ్చాయట.

మరి వాటిలో సలార్ నుంచి అయితే సినిమాలోని ఒక భయంకర యాక్షన్ సీక్వెన్స్ లోని సన్నివేశం కాగా మరొకటి ఆదిపురుష్ నుంచి ఏకంగా వీడియో నే లీక్ అయ్యిందట. ముఖ్యంగా ఇందులో రాముని వేషంలో ప్రభాస్ ఊహించని రీతిలో కనిపిస్తున్నాడని టాక్..

దీనితో ఈ రెండు షాకింగ్ లీక్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల టాలీవుడ్ నుంచి ఎన్నో సినిమాలు లీక్స్ బయటకొచ్చి ఆగాయి కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమాల నుంచే వరుస లీక్స్ బయటకి రావడం గమనార్హం.